బూట్లు తడుస్తాయని నీళ్లలోకి దిగని మంత్రి అనితా రాధాకృష్ణన్.. మత్స్యకారుడు మోసుకెళ్లిన వైనం.. వీడియో వైరల్
- తమిళనాడు, పాలవేర్కాడులో ఘటన
- కోతకు గురైన సముద్ర తీర ప్రాంతం
- మత్స్యకారులకు ధైర్యం చెప్పడానికి వెళ్లిన మంత్రి
- కాళ్లకు బురద అంటకుండా పర్యటన
తమిళనాడు మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. కోతకు గురైన సముద్ర తీర ప్రాంతాన్ని చూసి, మత్స్యకారులకు ధైర్యం చెప్పడానికి పాలవేర్కాడుకు వెళ్లిన రాధాకృష్ణన్ అక్కడి నీటిలో నడవడానికి చిరాకు పడ్డారు. ఒకవేళ నీటితో నడిస్తే తన ఖరీదైన బూట్లు పాడవుతాయని భావించారు. దీంతో అక్కడున్న మత్స్యకారులు ఆయనను ఎత్తుకుని తీసుకెళ్లారు.
ఈ వీడియోను స్థానిక పాలిమర్ న్యూస్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాలికి బురద అంటకుండా పడవలో ప్రయాణించిన రాధాకృష్ణన్ అనంతరం కూడా దానిలోంచి దిగడానికి వెనకాడారు. నీళ్లు ఉన్న చోటే పడవను నిలపడంతో అందులోంచి దిగలేదు. ఈ కారణంగా ఆయనను మత్స్యకారుడు మోసుకెళ్లాల్సి వచ్చింది. కనీసం నీళ్లలో నడవడానికి కూడా ఇష్టపడని మంత్రికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.