ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త వార్షిక ప్లాన్ తీసుకువచ్చిన జియో

  • ప్లాన్ ధర రూ.3,499
  • ఏడాది పాటు రోజుకు 3 జీబీ 
  • అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్
  • రోజుకు 100 ఎస్సెమ్మెస్ లు
  • డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏడాది ఫ్రీ
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇది సంవత్సరం ప్లాన్. అన్ లిమిటెడ్ కాల్స్ మాత్రమే కాదు, రోజుకు 3 జీబీ డేటా ఏడాదిపాటు పొందవచ్చు. ఈ కాంబినేషన్లో జియో నుంచి వార్షిక ప్లాన్ రావడం ఇదే ప్రథమం. ఈ ప్లాన్ ను పొందాలంటే రూ.3,499 చెల్లించాల్సి ఉంటుంది. వాయిస్ కాలింగ్ పై ఎలాంటి పరిమితులు లేవు. రోజుకు 100 ఎస్సెమ్మెస్ లు ఫ్రీ.

అంతేకాదు, ఓటీటీ కంటెంట్ ను పొందడానికి కూడా ఈ జియో ఈ ప్లాన్ వీలు కల్పిస్తుంది. తద్వారా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కంటెంట్ ను ఏడాదిపాటు ఎలాంటి రుసుం చెల్లించకుండా వీక్షించవచ్చు. ఇక, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ, జియో న్యూస్ సదుపాయాలు కూడా ఈ ప్లాన్ ద్వారా లభ్యమవుతాయి.


More Telugu News