టీడీపీ సీనియ‌ర్ నేత‌ల‌తో క‌లిసి దీక్ష‌కు దిగిన చంద్ర‌బాబు

  • అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో దీక్ష‌
  • ఏపీలో క‌రో‌నా బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌
  • పాల్గొన్న‌ అచ్చెన్నాయుడు, రామానాయుడు, యనమల, చినరాజప్ప, సోమిరెడ్డి
అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసన దీక్షకు దిగారు. ఏపీలో కరోనా బాధితులను ఆదుకోవాలనే డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సాధన దీక్ష చేపడుతోన్న నేప‌థ్యంలో ఆయ‌న ఇందులో పాల్గొన్నారు.  చంద్రబాబుతో పాటు దీక్షలో అచ్చెన్నాయుడు, రామానాయుడు, యనమల, సోమిరెడ్డి, చినరాజప్ప, తదితరులు దీక్ష‌లో కూర్చున్నారు.

మొత్తం 12 డిమాండ్ల పరిష్కారాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతి తెల్ల రేషన్‌ కార్డు కుటుంబానికి తక్షణ సాయంగా 10 వేలు ఆర్థిక సాయం అందించాల‌ని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అలాగే,   కరోనా మృతుల కుటుంబాలకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది. రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాల‌ని కోరుతోంది.

కరోనా విధి నిర్వహణలో మృతి చెందిన‌ కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు 50 లక్షలు అందించాలని డిమాండ్ చేస్తోంది. అలాగే, జర్నలిస్టులను కరోనా వారియర్లుగా గుర్తించి వారికి బీమా సౌకర్యం కల్పించాలని కోరుతోంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తామ‌ని టీడీపీ స్ప‌ష్టం చేసింది. త‌మ‌ సలహాలు, సూచనలను సీఎం జగన్‌ పట్టించుకోవట్లేద‌ని అచ్చెన్నాయుడు విమ‌ర్శ‌లు గుప్పించారు.


More Telugu News