దేశంలో కరోనా కేసులు తగ్గినా.. ఏపీలో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు తగ్గడం లేదు: చంద్రబాబు
- రాజారెడ్డి రాజ్యాంగానికి మరో మూడేళ్ల కాలపరిమితి
- ఇంతకు మూడు రెట్ల శాస్తి తప్పదు
- వైసీపీ పాలనలో చట్టం, రాజ్యాంగం దుర్వినియోగం
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ టీడీపీ అధినేత అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై బైండోవర్ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు.. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా ప్రతిపక్ష నేతలపై మాత్రం కేసులు తగ్గడం లేదని అన్నారు.
వైసీపీ పాలనలో రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం దుర్వినియోగం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా, అక్రమ కేసులకు, రౌడీ షీట్లకు భయపడే నేతలు టీడీపీలో లేరని తేల్చి చెప్పారు. అధికారం ఉంది కదా అని జగన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మున్ముందు అంతకు మూడురెట్ల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాజారెడ్డి రాజ్యాంగానికి మరో మూడేళ్ల వ్యాలిడిటీ ఉందన్న చంద్రబాబు.. హరివర ప్రసాద్, కృష్ణమూర్తి, సురేశ్‌లపై నమోదు చేసిన అక్రమ రౌడీషీట్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.