బీఎస్ బీడీ ఖాతాలకు వర్తించేలా ఎస్ బీఐ తీసుకువచ్చిన కొత్త నిబంధనలు ఇవిగో!

  • జీరో బ్యాలెన్స్ ఖాతాలకు కొత్త నిబంధనలు
  • నెలకు 4 ఉచిత నగదు లావాదేవీలు
  • పరిమితికి మించితే సర్వీస్ చార్జీ వర్తింపు
  • చెక్ బుక్ ల విషయంలోనూ పరిమితి
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్ బీడీ) ఖాతాదారులకు వర్తించేలా కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. బీఎస్ బీడీ ఖాతాదారులు (జీరో బ్యాలెన్స్ ఖాతాదారులు) బ్యాంక్ బ్రాంచీలు, ఏటీఎంల ద్వారా చేసే నగదు విత్ డ్రాలపై సర్వీస్ చార్జీలను సవరించింది. చెక్ బుక్ లు, మనీ ట్రాన్సఫర్లకు కూడా వర్తించేలా నిబంధనలు సవరించింది. ఈ కొత్త సవరణలు ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు అమల్లో ఉంటాయి.

  • నెలకు 4 సార్లు బ్యాంకు బ్రాంచీలు, ఏటీఎంల నుంచి ఉచితంగా నగదు లావాదేవీలు.
  • నాలుగు పర్యాయాలకు మించి చేసే నగదు లావాదేవీలపై సర్వీస్ చార్జి వసూలు.
  • 4 ఉచిత లావాదేవీల పరిమితికి పైన చేసే ఒక్కో లావాదేవీకి రూ.15తో పాటు జీఎస్టీ కూడా వసూలు చేస్తారు.
  • చెక్ బుక్ లావాదేవీలకు సంబంధించి ఖాతాదారులకు ఏడాదికి 10 లీవ్స్ తో కూడిన చెక్ బుక్ ఉచితం.
  • ఆ పరిమితి దాటిన తర్వాత 10 లీవ్స్ తో ఉన్న చెక్ బుక్ కు రూ.40తో పాటు జీఎస్టీ అదనం.
  • 25 లీవ్స్ చెక్ బుక్ కు రూ.75తో పాటు జీఎస్టీ అదనం.
  • సవరించిన చెక్ బుక్ సర్వీస్ చార్జీల నుంచి వృద్ధులకు మినహాయింపు.
  • మనీ ట్రాన్సఫర్ విషయంలో బ్రాంచీలు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో బీఎస్ బీడీ ఖాతాదారుల లావాదేవీలు ఉచితం.
  • బీఎస్ బీడీ ఖాతాదారుల ఆర్థికేతర లావాదేవీలపై ఎస్ బీఐ, ఎస్ బీఐయేతర బ్రాంచీలలో ఎలాంటి సర్వీస్ చార్జీలు వర్తించవు.
  • చెక్ ఉపయోగించి స్వయంగా చేసే రోజువారీ నగదు విత్ డ్రా పరిమితి రూ.1 లక్షకు పెంపు.
  • విత్ డ్రాయల్ ఫారం, సేవింగ్స్ పాస్ బుక్ ద్వారా చేసే రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితి రూ.25 వేలకు పెంపు.
  • చెక్ తో మాత్రమే చేసేలా థర్డ్ పార్టీ క్యాష్ విత్ డ్రాలు నెలకు రూ.50 వేలకు పరిమితం.


More Telugu News