నాసా జాబిల్లి ప్రయోగంలో భారతీయురాలి కీలక పాత్ర

  • నాసాలో సుభాషిణీ అయ్యర్ కీలకపాత్ర
  • ఆర్టిమిస్ స్పేస్ క్రాఫ్ట్ ను తీసుకెళ్లే కోర్ స్టేజ్ కు నేతృత్వం
  • అది పూర్తయ్యాక కూడా సేవలందిస్తానని వెల్లడి
  • మూడు భాగాలుగా ఆర్టిమిస్ ప్రయోగం
నాసా అంతరిక్ష ప్రయోగాల్లో భారతీయులు దూసుకుపోతున్నారు. మొన్నటికి మొన్న అంగారకుడిపైకి పంపిన పర్సెవరెన్స్ ప్రయోగంలో స్వాతి మోహన్ అనే భారతీయ శాస్త్రవేత్త కీలక పాత్ర పోషించగా.. తాజాగా చేపట్టబోయే చందమామ ప్రయోగం ఆర్టిమిస్ లోనూ మరో భారతీయ మహిళా శాస్త్రవేత్త కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే ఆర్టిమిస్ కు వెన్నెముక అయిన ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్నారు. ఆమె పేరు సుభాషిణీ అయ్యర్. తమిళనాడులోని కోయంబత్తూరు ఆమె సొంతూరు. ఆర్టిమిస్ స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోకి తీసుకెళ్లే కీలకమైన బోయింగ్ ‘కోర్ స్టేజ్’ను డీల్ చేస్తున్నారు.

‘‘ఎప్పుడో 50 ఏళ్ల క్రితం చంద్రుడిపై కాలుమోపాం. మళ్లీ ఇప్పుడు వెళ్లబోతున్నాం. ఈ ప్రాజెక్టులో నాసా నా నుంచి ఏం కోరుకుంటోందో దాని కన్నా ఎక్కువే నేను అందిస్తాను. కోర్ స్టేజ్ పూర్తయిన తర్వాత కూడా నా వంతు సహకారం అందిస్తా’’ అని ఆమె అన్నారు.

ఆర్టిమిస్ ను మూడు భాగాలుగా చేస్తున్నారు. ఆర్టిమిస్ 1లో సిబ్బంది లేకుండా స్పేస్ క్రాఫ్ట్ ను పంపిస్తున్నారు. ఆర్టిమిస్ 2లో చంద్రుడి చుట్టూ తిరిగొచ్చేలా క్రూను పంపిస్తున్నారు. చంద్రుడిపై కాలుమోపే అసలైన ప్రయోగం ఆర్టిమిస్ 3ని 2024లో చేయనున్నారు. ఆర్టిమిస్ 1లో భాగంగా స్పేస్ లాంచ్ సిస్టమ్ ద్వారా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ను చందమామ వద్దకు పంపించనున్నారు.

1992లో వీఎల్ బీ జానకిమయీ కాలేజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టాను ఆమె పొందారు. అప్పటికి ఆ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన మహిళల్లో ఈమె ఒకరు.


More Telugu News