మహిళాధికారులు, పురుషులు ఎవ్వరూ టీ-షర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకుని రాకూడదు: సీబీఐ కొత్త డైరెక్టర్ ఆదేశాలు
- ఇటీవలే సీబీఐ డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్ నియామకం
- అందరూ ఫార్మల్ డ్రెస్ వేసుకునే రావాలని ఆదేశాలు
- మహిళాధికారులు చీరలు, సాధారణ చొక్కాలు వంటివే వేసుకోవాలి
- జీన్సు, టీషర్టులు, స్పోర్ట్స్ షూ, చెప్పులు, అలంకరణలతో రాకూడదు
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్ ఇటీవలే నియమితుడైన విషయం తెలిసిందే. వచ్చి రావడంతోనే తమ దర్యాప్తు సంస్థ ఉద్యోగులు వేసుకోవాల్సిన దుస్తుల విషయంలో ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అధికారులు, ఇతర సిబ్బంది అందరూ ఫార్మల్ డ్రెస్ వేసుకునే రావాలని, జీన్స్, స్పోర్ట్ షూలు వంటివి వేసుకుని వస్తే ఉపేక్షించబోనని ఆయన పేర్కొనడం గమనార్హం.
ఈ మేరకు ఆయన జారీ చేసిన ఆదేశాల ప్రకారం... పురుషులు ఫార్మల్ చొక్కాలు, ప్యాంట్లు, బూట్లు మాత్రమే వేసుకుని విధులకు రావాలి. అలాగే, చక్కగా షేవింగ్ చేసుకుని రావాల్సి ఉంటుంది. అంతేకాదు, సీబీఐలో పనిచేస్తోన్న మహిళాధికారులు కూడా చీరలు, సాధారణ చొక్కాలు, సూటు, బూట్లు వేసుకుని మాత్రమే రావాలి.
మహిళా సిబ్బంది జీన్సు, టీషర్టులు, స్పోర్ట్స్ షూ, చెప్పులు, అలంకరణలతో కార్యాలయాలకు రావద్దని ఆదేశించారు. ఈ నియమ నిబంధలను దేశ వ్యాప్తంగా సీబీఐ సిబ్బంది కచ్చితంగా పాటించాల్సిందేనని అందులో పేర్కొన్నారు. నిజానికి సీబీఐ అధికారులు, ఇతర సిబ్బంది అందరూ ఫార్మల్ డ్రెస్‌నే వేసుకోవాల్సి ఉంటుందని ఓ అధికారి మీడియాకు చెప్పారు. అయితే, చాలా ఏళ్లుగా వారు ఈ నిబంధనను పాటించడం లేదని అన్నారు.