మూడేళ్లలో రూ.8 వేల కోట్లతో మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి: విజయసాయిరెడ్డి
- ఒకేరోజున 14 వైద్య కళాశాలలకు శంకుస్థాపన
- వర్చువల్ విధానంలో పాల్గొన్న సీఎం జగన్
- ఇంతకుముందు పాడేరు, పులివెందుల కళాశాలలకు శంకుస్థాపన
- రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య 25కి చేరుకుంటుందన్న విజయసాయి
ఏపీ సీఎం జగన్ ఒకే రోజు 14 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. వర్చువల్ విధానంలో ఆయన భారీ సంఖ్యలో వైద్య కళాశాలల నిర్మాణానికి నాంది పలికారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చారు. అంతకుముందే పులివెందుల, పాడేరు వైద్య కళాశాలలు ప్రకటించారని, వాటితో కలిపి మొత్తం 16 కాలేజీల నిర్మాణం జరగనుందని వెల్లడించారు. ఈ కాలేజీలను రాబోయే మూడేళ్లలో రూ.8 వేల కోట్లతో నిర్మించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పాత మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తం వైద్య కళాశాలల సంఖ్య 25కి చేరుకుంటుందని విజయసాయి వివరించారు.