తెలంగాణలో క్రమంగా అదుపులోకి వస్తున్న కరోనా

  • గత 24 గంటల్లో 42,526 కరోనా పరీక్షలు
  • 2,242 పాజిటివ్ కేసులు నమోదు
  • గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 343 కేసులు
  • 4,693 మందికి కరోనా నయం
  • 19 మంది మృతి
తెలంగాణలో కఠినంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ ఆంక్షలు ఫలితాన్నిస్తున్నట్టే కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 42,526 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,242 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గత కొన్నివారాల ఉద్ధృతి తర్వాత ఇవే అతి తక్కువ కేసులు అని చెప్పాలి. జీహెచ్ఎంసీ పరిధిలోనూ కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 343 కొత్త కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో అత్యల్పంగా 7 కేసులు గుర్తించారు. ఇటీవల కాలంలో ఓ జిల్లాలో సింగిల్ డిజిట్ కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.

ఇక, రాష్ట్రవ్యాప్తంగా 4,693 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 19 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 5,53,277 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,09,663 మంది కోలుకున్నారు. ఇంకా 40,489 మందికి చికిత్స కొనసాగుతోంది. అంతేకాదు, పాజిటివిటీ రేటు తగ్గిపోవడమే కాకుండా, రికవరీ రేటు 92.11 శాతానికి పెరిగింది.


More Telugu News