యువ‌కుడి స్మార్ట్‌ఫోనును తీసుకుని నేల‌కేసి కొట్టి.. చెంప‌ఛెళ్లుమ‌నిపించిన క‌లెక్ట‌ర్.. వీడియో వైర‌ల్

  • ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఘ‌ట‌న‌
  • లాక్‌డౌన్‌లో బ‌య‌ట‌కు వ‌చ్చిన యువ‌కుడు
  • కోప్ప‌డ్డ క‌లెక్ట‌ర్
  • పోలీసుల‌తో కొట్టించిన వైనం
ఓ యువ‌కుడి స్మార్ట్‌ఫోను తీసుకుని దాన్ని ధ్వంసం చేశారు ఓ క‌లెక్ట‌ర్. అనంత‌రం ఆ యువ‌కుడి చెంప‌ఛెళ్లుమ‌నించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. లాక్‌డౌన్ నేప‌థ్యంలో చత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో లాక్‌డౌన్ అమ‌ల‌వుతోంది.

దీంతో పోలీసుల‌తో క‌లిసి క‌లెక్ట‌రు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల అమ‌లు తీరును ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అమన్ మిట్టల్ (23)గా అనే యువ‌కుడు లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. మాస్క్ పెట్టుకుని వ‌చ్చిన ఆ యువ‌కుడు త‌న‌కు బ‌య‌ట తిరిగేందుకు అనుమ‌తి ఉంద‌ని క‌లెక్ట‌ర్‌కు చెప్పాడు.

అయితే, ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలియ‌దు. ఆ యువ‌కునిపై క‌లెక్ట‌ర్ చేయిచేసుకున్నారు. అనంత‌రం పోలీసులు వ‌చ్చి ఆ యువ‌కుడిని లాఠీల‌తో కొట్టారు.  ఆ యువకుడిని కొట్టాలని కలెక్టర్ ఆదేశించడం విమ‌ర్శ‌లకు తావిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డం, క‌లెక్ట‌ర్ తీరుపై జ‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌డంతో చివ‌ర‌కు   సూరజ్‌పూర్ జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఆ యువకుడిని అవ‌మానించే  ఉద్దేశం త‌న‌కు లేద‌ని తెలిపారు.  



More Telugu News