చైనా శాస్త్రవేత్త, హైబ్రిడ్ వరి వంగడ పితామహుడు కన్నుమూత
- ప్రపంచాన్ని ఆకలి చావుల నుంచి రక్షించిన యువాన్
- 1973లో అధిక దిగుబడి ఇచ్చే వరివంగడాల సృష్టి
- 9 శాతం సాగుభూమితో ప్రపంచంలోని ఐదో వంతు ప్రజలకు లబ్ధి
చైనాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, హైబ్రిడ్ వరి వంగడ పితామహుడు యువాన్ లోంగ్ పింగ్ అనారోగ్యంతో నిన్న మరణించారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. 1970 దశకంలో లోంగ్ సృష్టించిన హైబ్రిడ్ వరి వంగడాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకలి చావుల నుంచి కాపాడాయి. ఒకప్పుడు ఆహార సంక్షోభంలో చిక్కుకున్న చైనా ఇప్పుడు ఆహార భద్రత సాధించేందుకు లోంగ్ పింగే కారణం.
లోంగ్ అభివృద్ధి చేసిన హైబ్రిడ్ వరి వంగడాలతో 9 శాతం సాగుభూమితో ప్రపంచంలోని ఐదో వంతు ప్రజలకు ఆహార లబ్ధి లభిస్తోంది. 1949లో చైనా తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంది. తిండి దొరక్క ప్రజలు రోడ్లపైనే ఆకలితో చనిపోయారు. దీంతో తీవ్రంగా కలత చెందిన లోంగ్ 1973లో అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ వరి వంగడాలను సృష్టించారు.