మీడియా చానళ్లతో కలిసి రఘురామకృష్ణరాజు కుట్ర పన్నారంటూ దేశద్రోహం కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ
- మంగళగిరి సీఐడీ పీఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు
- ఏ1గా రఘురాజు.. ఏ2, ఏ3లుగా టీవీ 5, ఏబీఎన్
- అందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆరోపణ
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై సీఐడీ దేశద్రోహం కేసును నమోదు చేసింది. రఘురాజుపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలను పేర్కొన్నారు.
ఎఫ్ఐఆర్ లో ఉన్న వివరాలు ఇవే: ఒక పథకం ప్రకారం కొన్ని మీడియా చానళ్లతో కలిసి రఘురాజు కుట్ర పన్నారు. కులం, మతం ప్రాతిపదికన విభజన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని రెచ్చగొట్టేలా కుట్రలకు పాల్పడ్డారు.
రెడ్డి, క్రిస్టియన్ వర్గాలను రఘురాజు టార్గెట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని వినిపించేందుకు కొన్ని టీవీ చానళ్లతో కలిసి కుట్రపన్నారు. ఏబీఎన్, టీవీ5 చానళ్లు రఘురాజుకు స్లాట్స్ కేటాయించాయి. వీరందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి.
మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్ లో రఘురాజుపై కేసు నమోదు చేశారు. 124 ఏ (దేశ ద్రోహం), 153 ఏ (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం), రెడ్ విత్ 120 బీ (నేరపూరిత కుట్ర), 505 (రెచ్చగొట్టడం) సెక్షన్లపై కేసు బుక్ చేశారు. ఈ కేసులలో ఏ1గా రఘురాజు, ఏ2గా టీవీ5, ఏ3గా ఏబీఎన్ చానళ్లను చేర్చారు. సీఐడీ డీజీ రిపోర్టు ఆధారంగా కేసును నమోదు చేశారు.