'గని' కూడా వాయిదా పడ్డట్టేనా?
- వరుణ్ తేజ్ హీరోగా 'గని'
- బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథ
- తెలుగు తెరకి సయీ మంజ్రేకర్ పరిచయం
వరుణ్ తేజ్ హీరోగా ఆయన తాజా చిత్రంగా 'గని' రూపొందుతోంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు బాబి - సిద్ధు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లవలసింది. కానీ వరుణ్ తేజ్ బాక్సింగులో శిక్షణ కోసం విదేశాలకు వెళ్లడం, ఆ తరువాత లాక్ డౌన్ కారణంగా షూటింగు వాయిదా పడటం .. ఇలా ఎప్పటికప్పుడు ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది.
అనేక అవాంతరాలను అధిగమిస్తూ ఈ మధ్యనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాను జూలై 30వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ముందుగానే ప్రకటించారు. కానీ షూటింగు ఆలస్యంగా మొదలైంది. అంతేకాదు .. ప్రస్తుతం థియేటర్లు నడిచే పరిస్థితి లేదు. జూలై నాటికి పరిస్థితి చక్కబడుతుందా? అనేది ప్రశ్నార్థకమే.
ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడటం ఖాయమేనని చెప్పుకుంటున్నారు. కానీ అలాంటిదేం జరగదని దర్శకుడు కిరణ్ కొర్రపాటి చెబుతుండటం విశేషం. ఈ సినిమా ద్వారా కథానాయికగా సయీ మంజ్రేకర్ తెలుగు తెరకి పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.