క‌డ‌ప జిల్లాలో పేలుడు ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించాలి: చంద్ర‌బాబు

  • జిలెటిన్‌స్టిక్స్ వాహ‌నంలో పేలుడు.. 9 మంది మృతి 
  • మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన చంద్ర‌బాబు
  • ఇవి పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాలన్న టీడీపీ అధినేత 
క‌డ‌ప జిల్లా క‌ల‌స‌పాడు మండ‌లం మామిళ్ల‌ప‌ల్లె శివారులో జిలెటిన్‌స్టిక్స్ ను వాహ‌నంలో తీసుకొస్తుండ‌గా పేలుడు సంభ‌వించి తొమ్మిది మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, మ‌రికొంత‌మందికి గాయాలైన‌ విష‌యం తెలిసిందే.

టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు దీనిపై స్పందిస్తూ.. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. క‌డ‌ప పేలుడు ఘ‌ట‌న‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. 


More Telugu News