కేరళలో అధికార ఎల్డీఎఫ్ జోరు... 93 స్థానాల్లో లీడింగ్

  • కేరళలో మళ్లీ పినరయి విజయన్ దే ప్రభుత్వం!
  • ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో లెఫ్ట్ ఫ్రంట్
  • 44 స్థానాల్లో ముందజంలో ఉన్న కాంగ్రెస్ కూటమి
  • 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న బీజేపీ
కేరళలో సీఎం పినరయి విజయన్ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, అధికార ఎల్డీఫ్ (లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్) 93 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ 44, బీజేపీ 3 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

కాగా, పాలక్కాడ్ బరిలో దిగిన మెట్రోమ్యాన్ శ్రీధరన్ ఇప్పటివరకు 5 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2016 ఎన్నికల్లో లెఫ్ట్ కూటమికి 91 సీట్లు దక్కగా, ఇప్పుడే అదే తరహా ఫలితం పునరావృతం కానుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేరళ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 71 కాగా, దానికంటే అధికార ఎల్డీఎఫ్ ఎంతో ముందజలో ఉంది.


More Telugu News