నా పేరుతో ఓ వ్యక్తి మోసం చేస్తున్నాడు... జాగ్రత్తగా ఉండండి: హీరో సాయితేజ్
- అమాయకుల నుంచి డబ్బు తీసుకుంటున్నాడన్న సాయితేజ్
- న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని వెల్లడి
- మోసగాళ్లకు దూరంగా ఉండాలని పిలుపు
- స్క్రీన్ షాట్ పంచుకున్న వైనం
ఓ వ్యక్తి తన పేరుతో మోసాలకు పాల్పడుతున్నాడని మెగా హీరో సాయితేజ్ వెల్లడించారు. ఆ మోసగాడి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేశారు. "నాతో నటించిన వాళ్ల నుంచే కాకుండా, ఇతరుల నుంచి కూడా నా పేరు చెప్పుకుని అతడు ఆర్థిక సహాయం కోరుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. నావైపు నుంచి న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. దీని పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ఎవరైనా నా పేరు వాడుకుని మీతో సంభాషించేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారి నుంచి దూరంగా ఉండండి" అని సాయితేజ్ సూచించారు. అంతేకాదు, తన పేరు వాడుకుంటూ చీటింగ్ చేస్తున్న ఆ వ్యక్తి సంభాషణ తాలూకు స్క్రీన్ షాట్ ను కూడా పంచుకున్నారు.