కరోనా వ్యాక్సిన్ సింగిల్ డోసు తీసుకున్నా కరోనా నుంచి చాలా వరకు రక్షణ!
- ఒక్క డోసు తీసుకున్న తర్వాత కరోనా బారిన పడిన వారిపై అధ్యయనం
- వారి నుంచి కుటుంబ సభ్యులకు వైరస్ సోకే అవకాశం తక్కువ
- తేల్చిన పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ పరిశోధకులు
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటికే శాస్త్రవేత్తలు అనేక వ్యాక్సిన్లను అభివృద్ధి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పరిశోధకులు వ్యాక్సిన్ల ప్రభావంపై అధ్యయనాలు చేస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లలో చాలా వరకు రెండు డోసులు ఇచ్చేవే ఉన్నాయి.
అయితే, ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఒక్క డోసు తీసుకున్న వారు అనంతరం కరోనా బారిన పడితే వారి నుంచి కుటుంబ సభ్యులకు వైరస్ సోకే అవకాశం చాలా తక్కువని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ పరిశోధకులు తెలిపారు.
ఫైజర్, ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్) వ్యాక్సిన్ తీసుకున్న వారిపై వారు ఈ అధ్యయనం జరిపారు. ప్రజలు తొలి డోసు తీసుకున్న మూడు వారాల అంనతరం కరోనా బారిన పడితే వారి నుంచి కుటుంబ సభ్యులకు వైరస్ సోకే అవకాశం 38-49 శాతం తగ్గినట్లు చెప్పారు. వ్యాక్సిన్ తీసుకుంటే అది వ్యాప్తిని కూడా తగ్గిస్తుందన్న విషయం స్పష్టమైందని తెలిపారు.
ఒక డోసు వ్యాక్సిన్ తీసుకుని కరోనా బారిన పడిన వారిని అధ్యయనం చేసి ఈ వివరాలు చెప్పారు. మొత్తం 24 వేల కుటుంబాలపై ఈ అధ్యయనం చేసినట్లు వివరించారు. ఆయా కుటుంబాల్లో ఒక్కరు చొప్పున మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా వ్యాక్సిన్ బారి నుంచి తప్పించుకోవచ్చని గతంలోనూ పలు పరిశోధనలు తేల్చాయి. దీన్ని బట్టి వ్యాక్సిన్ సత్ఫలితాలిస్తున్నట్లు చెప్పొచ్చని పరిశోధకులు చెప్పారు.