భారత్‌లో పరిస్థితులు హృదయ విదారక స్థితిని మించిపోయాయి: డబ్ల్యూహెచ్‌ఓ
- భారత్‌లో కరోనా ఉగ్రరూపం
- తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్
- సాధ్యమైన సాయం అందిస్తున్నామని వెల్లడి
- అదనపు సిబ్బంది, వైద్య పరికరాలు పంపుతామని హామీ
భారత్‌లో కరోనా ఉద్ధృతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో పరిస్థితి ‘హృదయ విదారక స్థితిని కూడా మించి పోయింది’ అని వ్యాఖ్యానించారు. కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేలా సంస్థ తరఫున అదనపు సిబ్బంది, పరికరాలను పంపుతున్నామని తెలిపారు.
భారత్‌లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సాధ్యమైన సాయం చేస్తున్నామని టెడ్రోస్ తెలిపారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ప్రీఫ్యాబ్రికేటెడ్ మొబైల్ ఫీల్డ్ ఆసుపత్రులు, ఇతర ల్యాబ్ సరఫరాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. 2,600 మంది అదనపు డబ్ల్యూహెచ్‌ఓ సిబ్బందిని భారత్‌కు పంపనున్నట్లు తెలిపారు.
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2,812 మంది మృతి చెందారు. కొత్తగా 3,52,991 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.