రాణించిన సన్ రైజర్స్ బౌలర్లు... టాస్ గెలిచినా భారీ స్కోరు సాధించలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్

  • చెన్నైలో సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 159 రన్స్
  • రాణించిన పృథ్వీ షా, స్టీవ్ స్మిత్
  • సిద్ధార్థ్ కౌల్ కు 2 వికెట్లు
ప్రత్యర్థులను భారీ స్కోర్లు సాధించనివ్వకుండా కట్టడి చేయడంలో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లోనూ సన్ రైజర్స్ బౌలర్లు తమ క్రమశిక్షణ చాటుకున్నారు. అయితే ఫీల్డర్లు కొన్ని క్యాచ్ లు వదిలినప్పటికీ, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఢిల్లీని ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేశారు.

చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత 4 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(53), శిఖర్ ధావన్ (28) ఊపు చూస్తే స్కోరు 200 దాటడం ఖాయమనిపించింది. కానీ సన్ రైజర్స్ బౌలర్లు వ్యూహాత్మకంగా బంతులు వేసి పరుగులకు అడ్డుకట్ట వేశారు. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ (37) ఓ మోస్తరుగా రాణించగా, చివర్లో స్టీవ్ స్మిత్ 34 పరుగులతో అజేయంగా నిలిచాడు. సన్ రైజర్స్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ 2, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.


More Telugu News