మే నెలలో అత్యధిక కరోనా మరణాలు: ఐఎంహెచ్‌ఈ
- మే 10 నాటికి రోజుకి 5,600 మరణాలు
- ఏప్రిల్-ఆగస్టు మధ్య మూడు లక్షల మరణాలు
- జులై చివరి నాటికి మొత్తం 6.65 లక్షల మరణాలు
- అమెరికా ఐఎంహెచ్‌ఈ అధ్యయనంలో వెల్లడి
దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మే ద్వితీయార్ధం నాటికి భారత్‌లో మరణాలు అత్యధికంగా 5,600 వరకు నమోదయ్యే అవకాశం ఉందని ఓ అధ్యయనం తెలిపింది. ఏప్రిల్ - ఆగస్టు మధ్య మూడు లక్షల మంది మరణించే ప్రమాదం ఉందని పేర్కొంది. ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐఎంహెచ్‌ఈ)’ జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
రానున్న వారాల్లో కరోనా మహమ్మారి ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని ఐఎంహెచ్‌ఈ పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, మరణాల రేటును బట్టి దీన్ని అంచనా వేసింది. మే 10న అత్యధికంగా 5,600 మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్ 12- ఆగస్టు 1 మధ్య కొత్తగా 3,29,000 మంది మరణిస్తారని అంచనా వేసింది. దీంతో జులై చివరి నాటికే మొత్తం మరణాలు 6,65,000కు చేరతాయని లెక్క గట్టింది. అయితే, అందరూ మాస్కులు ధరించడం వల్ల మరణాల సంఖ్యను 70 వేల వరకు తగ్గించొచ్చని తెలిపారు.