కరోనా నుంచి కోలుకున్న సోనూ సూద్

  • ఇటీవల సోనూ సూద్ కు కరోనా
  • తాజా పరీక్షల్లో నెగెటివ్
  • కోలుకున్నానని సింబాలిక్ గా చెప్పిన సోనూ 
  • నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ కు కరోనారోగి తరలింపు
  • ఎయిర్ అంబులెన్స్ ఖర్చు భరించిన వైనం
ప్రముఖ నటుడు సోనూ సూద్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చింది. తనకు నెగెటివ్ వచ్చిందన్న విషయాన్ని సోనూ సూద్ సింబాలిక్ గా చెప్పే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇక, గత లాక్ డౌన్ సమయంలో తన దాతృత్వ సేవలతో విశేషమైన ఖ్యాతి అందుకున్న సోనూ సూద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. భారతి అనే మహిళ కరోనాతో బాధపడుతుండగా, ఆమె పరిస్థితి విషమించింది. దాంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను నాగ్ పూర్ నుంచి హైదరాబాదుకు ఎయిర్ అంబులెన్స్ ద్వారా వాయుమార్గంలో తరలించారు. అందుకైన ఖర్చును సోనూ సూద్ భరించారు.


More Telugu News