మా రాష్ట్రానికి వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ ను ఢిల్లీ ప్రభుత్వం దోచుకుపోయింది: హర్యానా మంత్రి
- ఫరీదాబాద్ కు వస్తున్న ట్యాంకర్ ను తీసుకెళ్లారు
- ట్యాంకర్లకు పోలీసు భద్రత కల్పించాలని ఆదేశించాను
- ఢిల్లీకి ఆక్సిజన్ పంపించాలని ఒత్తిడి వస్తోంది
తమ రాష్ట్రానికి వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లలో ఒకదాన్ని ఢిల్లీ ప్రభుత్వం దొంగతనంగా తీసుకెళ్లిందని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ మండిపడ్డారు. ఫరీదాబాద్ కు నిన్న వస్తున్న ట్యాంకర్ ను ఢిల్లీ ప్రభుత్వం తీసుకెళ్లిందని తెలిపారు. అప్పటి నుంచి ఆక్సిజన్ ను తీసుకొస్తున్న వాహనాలకు పోలీసు భద్రత కల్పించాలని ఆదేశించానని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వాలే ఇలాంటి పనులకు పాల్పడితే, ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుందని తెలిపారు. తమ ఆక్సిజన్ ను ఢిల్లీకి పంపించాలని ఒత్తిడి వస్తోందని... వారికి ఆక్సిజన్ పంపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే తాము ఆ పని చేయగలమని స్పష్టం చేశారు. అనిల్ విజ్ హర్యానా హోం మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు.