ఐపీఎల్: చెన్నై సూపర్ కింగ్స్ పై టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్
- ఐపీఎల్ లో నేడు చెన్నై వర్సెస్ రాజస్థాన్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ సారథి
- ఎలాంటి మార్పుల్లేకుండా బరిలో దిగిన రెండు జట్లు
- పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తుందంటున్న శాంసన్
ఐపీఎల్ లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే మైదానం వేదికగా నిలుస్తోంది.
టాస్ సందర్భంగా చెన్నై జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ, ఈ మ్యాచ్ కోసం జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించాడు. పిచ్ పరిస్థితిని బట్టి ఆటతీరును సమీక్షించుకుంటామని తెలిపాడు. అటు రాజస్థాన్ రాయల్స్ కూడా గత మ్యాచ్ ఆడిన జట్టునే బరిలో దింపింది.
టాస్ గెలిచిన అనంతరం రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. మొదట బౌలింగ్ చేసేందుకు పిచ్ అనుకూలంగా ఉందని తెలిపాడు. చెన్నై జట్టు బలమైన ప్రత్యర్థి అయినప్పటికీ, తాము గట్టి పోటీ ఇస్తామని స్పష్టం చేశాడు.