ప‌ట్టాల‌పై ప‌డ్డ చిన్నారి ప్రాణాలు కాపాడిన రైల్వే ఉద్యోగి.. వీడియో ఇదిగో

  • ముంబైలో ఘ‌ట‌న‌
  • వీడియో పోస్ట్ చేసిన రైల్వే శాఖ‌
  • పాయింట్‌మ‌న్ పై ప్ర‌శంస‌లు
ఫ్లాట్ ఫాం పైనుంచి మ‌రొక మ‌హిళ‌తో న‌డుచుకుంటూ వెళ్తోన్న ఓ చిన్నారి ఒక్క‌సారిగా అదుపుత‌ప్పి రైలు ప‌ట్టాల‌పై ప‌డిపోయాడు. ఇంత‌లో ఓ రైలు అదే ప‌ట్టాల‌పై దూసుకొస్తోంది. ప్లాట్ ఫాం పై ఉన్న మ‌హిళా భ‌య‌ప‌డుతూ ఉండిపోయింది. ఈ విష‌యాన్ని గుర్తించిన పాయింట్స్‌మ‌న్ క్ష‌ణాల వ్య‌వ‌ధిలో రైలు ప‌ట్టాల‌ వెంబడి ప‌రుగులు తీస్తూ వ‌చ్చి చిన్నారిని ఒక్క ఉదుటున పైకి లేపి ప్లాట్ ఫాంపైకి చేర్చాడు.

అనంత‌రం తానూ ప్లాట్ ఫాంపైకి వ‌చ్చాడు. ఈ ఘ‌ట‌న ముంబైలోని వాంగ్‌ణీ రైల్వే స్టేష‌న్  వ‌ద్ద చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్త‌మ‌య్యాయి. చిన్నారిని పాయింట్‌మ‌న్ మ‌యూర్ షెల్ఖే కాపాడాడ‌ని తెలుపుతూ రైల్వే మంత్రిత్వ శాఖ ఈ వీడియోను పోస్ట్ చేసి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించింది.


More Telugu News