సీఎం జగన్‌కు నారా లోకేశ్ లేఖ
- పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలి
- లేదంటే వాయిదా వేయాలి
- ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటం ఉత్తమం
- ఏపీలో టీకా పంపిణీ రేటు ఘోరంగా ఉంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసి పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని కోరినట్లు టీడీపీ నేత నారా లోకేశ్ తెలిపారు. కరోనా విజృంభణ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినట్లు తెలిపారు.
'కరోనా తీవ్రత దృష్ట్యా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయటం లేదా వాయిదా వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి లేఖ రాశాను. జూన్ లో మన రాష్ట్రంలో 15 లక్షలకు పైగా విద్యార్థులు పది, ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉంది' అని వివరించారు.
'వేచి చూసే ధోరణి కంటే విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటం ఉత్తమం. ఏపీలో టీకా పంపిణీ రేటు ఘోరంగా ఉన్న సమయంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడం తగదు. అందుకే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పై ప్రభుత్వం ఆలోచన చేయాలి' అని లోకేశ్ అన్నారు.