బ్రెజిల్‌లో కరోనా మృతుల‌ను ఖ‌న‌నం చేయ‌డానికి స్థ‌లం లేని వైనం.. శ‌వ‌పేటిక‌ల‌ను ఉంచ‌డానికి భ‌వ‌నాల నిర్మాణం

  • బ్రెజిల్ లో మొద‌టి నుంచి క‌రోనా విజృంభ‌ణ
  • క‌రోనాతో 3.69 లక్షల మంది మృతి
  • శ్మశానవాటికలో భవనాల నిర్మాణం  
బ్రెజిల్ లో మొద‌టి నుంచి క‌రోనా విజృంభ‌ణ ఉద్ధృత స్థాయిలో ఉన్న విష‌యం తెలిసిందే. క‌రోనా మ‌ర‌ణాల సంఖ్యలోనూ ప్ర‌పంచంలో రెండో స్థానంలో ఉంది. దీంతో మృతదేహాలను ఖననం చేసేందుకు స్థ‌లాలు కూడా దొర‌క‌ని ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. క‌రోనాతో బ్రెజిల్‌లో ప్రతి రోజు వేల మంది మృతి చెందుతున్నారు. ఇప్పటివరకు క‌రోనాతో 3.69 లక్షల మంది మ‌ర‌ణించారు.

బ్రెజిల్‌లోని రియోడిజనేరోలో ఇప్పటికే ఉన్న శ్మశాన వాటికలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో వాటిని మరింతగా విస్తరిస్తున్నారు. శవపేటికలు పెట్టేందుకు ఆ ప్రాంతంలో ఎత్తయిన నిర్మాణాలను చేప‌ట్టారు. అయితే,  మృతుల సంఖ్య విప‌రీతంగా పెరిగిపోతుండ‌డంతో అవి కూడా నిండిపోయాయి. దీంతో మరిన్ని బ్లాక్‌లను నిర్మిస్తున్నారు. ప్ర‌ధానంగా ఇన్నోమా శ్మశానవాటికలో ఈ భవనాల నిర్మాణం జ‌రుగుతోంది. శ‌శ్మాన‌వాటిక‌లు శ‌వ‌పేటిక‌లు భారీగా వ‌స్తున్నాయి.  






More Telugu News