రెమ్ డెసివిర్ ధర గరిష్ఠంగా రూ. 2,500: ఏపీ సర్కారు ఉత్తర్వులు
- పలు ప్రాంతాల్లో నిండుకుంటున్న రెమ్ డెసివిర్
- అధిక ధరకు అమ్ముకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులు
- కఠిన చర్యలు తప్పవన్న అనిల్ కుమార్ సింఘాల్
ఆంధ్రప్రదేశ్ లో 100 ఎంజీ రెమ్ డెసివిర్ ధరను రూ. 2,500కు మించి అమ్మరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నివారణకు ఈ ఔషధాన్ని విరివిగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా, రెమ్ డెసివిర్ ఇంజక్షన్ స్టాక్స్ నిండుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఔషధానికి డిమాండ్ పెరిగి బ్లాక్ మార్కెట్ అవుతోందన్న వార్తలు కూడా వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఉన్న ఆసుపత్రులతోపాటు, లేని ఆసుపత్రుల్లోనూ కరోనా రోగుల నుంచి రెమ్ డెసివిర్ కు రూ. 2,500 మాత్రమే వసూలు చేయాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రెటరీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.