ఎయిమ్స్‌లో 20 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌

  • ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా
  • ఎయిమ్స్‌లో 18 మంది రెసిడెంట్‌ డాక్టర్లకు కొవిడ్‌-19
  • ఆరుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థులకూ సోకిన మహమ్మారి
  • గంగారామ్‌ ఆస్పత్రిలోనూ 32 మందికి పాజిటివ్‌
ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ ‌(ఎయిమ్స్‌)లో 20 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో 18 మంది రెసిడెంట్‌ డాక్టర్లు కాగా.. మరో ఇద్దరు ఫ్యాకల్టీ సభ్యులు. సంస్థలోని మరో ఆరుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థులకు కూడా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. వీరందరిలో ముగ్గురు మాత్రమే కరోనా టీకా తొలి డోసు తీసుకున్నట్లు వెల్లడించారు.

ఎయిమ్స్‌లో మొత్తం 700 మంది ఫ్యాకల్టీ సభ్యులు, 2500 మంది రెసిడెంట్‌ డాక్టర్లు పనిచేస్తున్నారు. మరో 4000 మంది నర్సులు, 2,000 మంది సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దాని నివారణకు ఈ సంస్థ విశేష కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని మరో ప్రముఖ ఆసుపత్రి సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌లో కూడా 37 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు సమాచారం.


More Telugu News