ధోనీ హెలికాప్టర్ షాట్.. ఆయన జెర్సీ నెంబర్.. కలిపితే కొత్త 'చాక్‌లెట్'!
- ఆటగాడిగా ధోనీలోని లక్షణాలే స్ఫూర్తిగా చాక్‌లెట్ బ్రాండ్
- రూపొందించిన ఫుడ్ అండ్ బెవరేజెస్ సంస్థ 7ఇంక్‌బ్రూస్
- హెలికాప్టర్ షాట్, జెర్సీ నెంబర్‌తో కలిపి బ్రాండ్ పేరు
- సంస్థ వాటాదారుడిగా, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ధోనీ
ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ హెలికాప్టర్ షాట్ యువ ఆటగాళ్లకే కాదు.. చాక్లెట్ల తయారీ సంస్థలకు కూడా స్ఫూర్తినిస్తోంది. 7ఇంక్‌బ్రూస్(7InkBrews) అనే ఫుడ్ అండ్ బెవరేజెస్ సంస్థ ధోనీ హెలికాప్టర్ షాట్, జెర్సీ నెంబర్ కలయికతో ఓ కొత్త చాక్‌లెట్ బ్రాండ్‌ను విడుదల చేసింది. అయితే ఇక్కడ విశేషమేమిటంటే ఈ కంపెనీలో ధోనీ కూడా ఓ వాటాదారుడు. బ్రాండ్ అంబాసిడర్ కూడా.
ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీని మోహిత్ భాగ్‌చందనీ, అదిల్ మిస్త్రీ, కునల్ పటేల్ కలిసి స్థాపించారు. కొత్తగా విడుదల చేసిన చాక్‌లెట్లు, బెవరేజ్‌లను కాప్టర్7 అనే బ్రాండ్ పేరుతో విడుదల చేశారు. ఇందులో కాప్టర్ హెలికాప్టర్ షాట్‌లోని భాగం కాగా.. 7, ధోనీ జెర్సీ నెంబరు.
7ఇంక్‌బ్రూస్ వాటాదారుడిగా, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందుకు సంతోషిస్తున్నానని ధోనీ అన్నారు. ఓ క్రికెటర్‌గా ధోనీలో ఉన్న లక్షణాలకు అనుగుణంగా, హెలికాప్టర్ షాట్‌ను కూడా కలిపి బ్రాండ్ పేరును రూపొందించామని సంస్థ తెలిపింది. ప్రస్తుతం ముంబయి, పుణె, గోవా, బెంగళూరులో విడుదల చేసిన ఈ బ్రాండ్‌ను త్వరలో ఉత్తరప్రదేశ్, హరియాణా, ఝార్ఖండ్, పంజాబ్, చంఢీగఢ్‌లోనూ అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది.