సినీ పరిశ్రమ అనుబంధ వ్యవస్థలకు రాయితీలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- చిత్ర పరిశ్రమపై కరోనా పడగ
- దెబ్బతిన్న అనుబంధ వ్యవస్థలు
- కష్టాల్లో థియేటర్లు, మల్టీప్లెక్సులు
- ఊరటనిచ్చేలా సర్కారు చర్యలు
కరోనా సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన చిత్ర పరిశ్రమ అనుబంధ వ్యవస్థలకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చే చర్యలు ప్రకటించింది. ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఏప్రిల్, మే, జూన్ మాసాల విద్యుత్ స్థిర చార్జీల చెల్లింపులపై వెసులుబాటు కల్పించింది. థియేటర్లు, మల్టీప్లెక్సులు ఈ మూడు మాసాల విద్యుత్ చార్జీలు వాయిదా వేసుకునేందుకు వీలు కల్పించింది. ఈ బకాయిలను జులై నుంచి డిసెంబరు మధ్యలో ఎప్పుడైనా చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది. బ్యాంకు రుణాలకు 50 శాతం మేర వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.