మహమ్మారి వీర విజృంభణ... 70 వేలు దాటిన రోజువారీ కేసులు!

  • బుధవారం నాడు 72,330 కొత్త కేసులు
  • కన్నుమూసిన 459 మంది
  • ఆరున్నర కోట్ల మందికి పైగా టీకాలు
ఇండియాలో కరోనా కొత్త కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న కేసులతో పోలిస్తే డిశ్చార్చ్ అవుతున్న వారి సంఖ్య తక్కువగా ఉంటుండటంతో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం నాడు దేశవ్యాప్తంగా 72,330 కొత్త కేసులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఈ ఉదయం ప్రకటించింది. ఇదే సమయంలో 459 మంది కరోనా కారణంగా గడచిన 24 గంటల్లో మరణించారని, మరో 40,382 మంది చికిత్స తరువాత డిశ్చార్చ్ అయ్యారని వెల్లడించింది.

ఇక ఇండియాలో ఇప్పటివరకూ మొత్తం 1,22,21,665 కేసులు రాగా, అందులో 1,14,74,683 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య 5,84,055గా ఉండగా, ఇంతవరకూ 1,62,927 మంది కన్నుమూశారు. బుధవారం నాటికి 6,51,17,896 మందికి కరోనా టీకాలను ఇచ్చామని కేంద్రం పేర్కొంది.


More Telugu News