ఇడుగో ఇతడే నా అల్లూరి సీతారామరాజు... ధైర్యానికి ప్రతీక: రాజమౌళి
- ఆర్ఆర్ఆర్ నుంచి మరో అప్ డేట్
- అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్
- లుక్కును విడుదల చేసిన రాజమౌళి
- సోషల్ మీడియాలో భారీ స్పందన
భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ఆర్ఆర్ఆర్. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్ డేట్ ను దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్కును అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. బ్యాక్ గ్రౌండ్ లో మన్యం భగభగమండుతుండగా, అంబరానికి విల్లు గురిపెట్టిన రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను ఆవాహన చేసుకున్న తీరు ఆ ఫొటో ద్వారా స్పష్టమైంది.
దీనిపై రాజమౌళి స్పందించారు. 'ధైర్యం, ఆత్మగౌరవం, పరిపూర్ణత కలిగిన వ్యక్తి... ఇడుగో.. ఇతడే నా అల్లూరి సీతారామరాజు 'అంటూ వ్యాఖ్యానించారు. కాగా, సోషల్ మీడియాలో ఈ అప్ డేట్ ను పోస్టు చేసిన కొద్దిసేపట్లోనే వేల సంఖ్యలో రీట్వీట్లు, లైకులతో అభిమానులు హోరెత్తిస్తున్నారు.