ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేనిని కలిసిన గంటా శ్రీనివాసరావు
- విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
- ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా
- స్పీకర్ కు రాజీనామా పత్రం పంపిన వైనం
- తాజాగా స్పీకర్ ను కలిసి రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి
- అమరావతి వెళ్లగానే పరిశీలిస్తానన్న స్పీకర్ తమ్మినేని
విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాటంలో చురుగ్గా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆమదాలవలసలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ను కలిశారు. ఇటీవల తాను పంపిన రాజీనామా లేఖను ఆమోదించాలంటూ స్పీకర్ ను కోరారు. గంటా విజ్ఞప్తిపై స్పందించిన తమ్మినేని... మరో వారం రోజుల్లో అమరావతి వెళ్లగానే రాజీనామా లేఖను పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు ఇటీవల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడం ద్వారా కేంద్రంపై రాజకీయపరమైన ఒత్తిడి పెంచవచ్చని ఆయన భావిస్తున్నారు. అందుకే పార్టీలకు అతీతంగా పదవులకు రాజీనామాలు చేసి ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాటానికి కలిసి రావాలని ప్రజాప్రతినిధులకు పిలుపునిస్తున్నారు.