తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి నా పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు: ఉప్పెన హీరో
- నాకు ఎలాంటి అధికారిక ఖాతాలు లేవు
- దయచేసి ఎవరూ ఫాలో కాకూడదు
- ప్రకటన చేసిన వైష్ణవ్ తేజ్
సామాజిక మాధ్యమాల్లో సినీ ప్రముఖుల పేరిట నకిలీ ఖాతాలు సృష్టిస్తూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆ ఖాతాలు నకిలీవని చాలా మంది గుర్తించలేకపోతున్నారు. దీంతో సినీ ప్రముఖులు ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పెన హీరో, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ పేరిట కొందరు నకిలీ ఖాతాలు సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్నారు.
దీనిపై వైష్ణవ్ తేజ్ స్పందించి ఓ ప్రకటన చేశాడు. సోషల్ మీడియాలో తనకు ఎలాంటి అధికారిక ఖాతాలు లేవని స్పష్టం చేశాడు. తన పేరుతో ఉన్న ఫేక్ సోషల్ మీడియా ఖాతాలను దయచేసి ఎవరూ ఫాలో కాకూడదని విజ్ఞప్తి చేశాడు.
కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి తన పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి వాడుతున్నారని చెప్పాడు. కాగా, తన తొలి సినిమా ‘ఉప్పెన’తో హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ తాజాగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించాడు.