ఒక్క కేసునైనా ఎదుర్కొని నిర్దోషిగా బయటపడు చంద్రం: విజయసాయిరెడ్డి
- చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి
- చట్టం ముందు నిలబడే ధైర్యం ఉందా? అని ప్రశ్న
- ప్రజాకోర్టులో ఇంకా ఘోరమైన శిక్షలు తప్పవని వ్యాఖ్య
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లను రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు. చంద్రబాబుకు చట్ట విరుద్ధంగా నోటీసులు ఇచ్చారని... ఈ పిటిషన్ పై వెంటనే విచారణ జరపాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో, రేపు ఉదయం విచారణను చేపడతామని కోర్టు తెలిపింది.
మరోవైపు, చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'అవినీతికి పాల్పడి నానా అడ్డదారులు తొక్కే బదులు ఒక్క కేసునైనా ఎదుర్కొని నిర్దోషిగా బయటపడు చంద్రం' అని సెటైర్ వేశారు. అసలు చట్టం ముందు నిలబడే దమ్ముందా? అని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా వందోసారి స్టే కోసం ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ప్రజాకోర్టులో ఇంకా ఘోరమైన శిక్షలు తప్పవని అన్నారు. ఎమ్మెల్యేగా కూడా ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. మీకు ఇల్లే జైలు అయిపోతుందని అని చెప్పారు.