ఏపీలో మరోసారి 200 దాటిన కరోనా కేసులు
- ఏపీలో కొత్తగా 218 కరోనా కేసులు
- చిత్తూరు జిల్లాలో 63 కేసుల నమోదు
- రాష్ట్రంలో ప్రస్తుతం 1,795 యాక్టివ్ కేసులు
మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో కూడా గత 24 గంటల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 31,165 మంది శాంపిల్స్ ని పరీక్షించగా... 218 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఇదే సమయంలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించకపోవడం గమనార్హం. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 63 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 117 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,92,740కి పెరిగింది. 8,83,759 మంది కరోనా నుంచి కోలుకోగా... 7,186 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి.