ఓట‌రు బిడ్డ‌ను ఎత్తుకున్న‌ పోలీసు.. ఫొటో వైర‌ల్!

  • నిన్న బీబీ న‌గ‌ర్‌లో విధులు
  • కానిస్టేబుల్ క‌విత‌కు రివార్డు
  • అభినందించిన రాచ‌కొండ సీపీ
ఓ ఓట‌రు ఓటు వేసి వ‌చ్చే వ‌ర‌కు ఆమె బిడ్డను ఎత్తుకుని, ఏడ‌వ‌కుండా చూశారు క‌విత అనే ఓ పోలీసు కానిస్టేబుల్. దీంతో ఆమెకు రివార్డు ప్ర‌క‌టించారు. నిన్న తెలంగాణ‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ క‌వితకు బీబీనగర్‌లోని పోలింగ్‌ బూత్‌ వద్ద డ్యూటీ వేశారు. ఓ మ‌హిళ ఓటు వేసేందుకు వ‌చ్చి త‌న బిడ్డ‌ను ఎవ‌రిక‌యినా ఇచ్చి పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటు వేయాల‌నుకుంది.

అక్క‌డే క‌విత విధుల్లో ఉండ‌డాన్ని చూసి ఆమెకు త‌న బిడ్డ‌ను ఇచ్చింది. క‌విత ఆ బిడ్డ‌ను ఎత్తుకుని ఉండ‌గా తోటి పోలీసులు ఫొటో తీశారు. రాచకొండ సీపీ ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేసి క‌విత‌ను అభినందించారు. ఆమెపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.


More Telugu News