దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
- 24 గంటల్లో 23,285 మందికి కరోనా
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,08,846
- మృతుల సంఖ్య 1,58,306
- 2,61,64,920 మందికి వ్యాక్సిన్లు
దేశంలో కొత్త కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 23,285 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 15,157 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,08,846కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 117 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,306కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,09,53,303 మంది కోలుకున్నారు. 1,97,237 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 2,61,64,920 మందికి వ్యాక్సిన్లు వేశారు.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 22,49,98,638 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,40,345 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.