రైతుల్ని తిట్టిన ప్రతి తిట్టు, కొట్టిన ప్రతి దెబ్బ గుర్తుంటుంది: నారా లోకేశ్
- రాష్ట్రం కోసం భూమిని త్యాగం చేసిన రైతులను బూతులు తిడతారా?
- రైతులను అవమానించిన ప్రతి ఒక్కడు వారి కాళ్లు పట్టుకునేలా చేస్తాం
- రేపో, మాపో జైలుకు వెళ్లే జగన్ను చూసుకుని పోలీసులు రెచ్చిపోతున్నారు
ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రం కోసం భూమిని త్యాగం చేసిన రైతుల్ని అమ్మనా బూతులు తిట్టడం దారుణమన్న లోకేశ్.. ఎంత బలుపు, అహంకారం లేకపోతే ఇలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులను తిట్టిన ప్రతి తిట్టు, కొట్టిన ప్రతి దెబ్బ, పెట్టిన ప్రతి కేసు గుర్తుంటుందని, రైతులను అవమానించిన ప్రతి ఒక్కడు రైతుల కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పేలా చేస్తామని అన్నారు. రేపో, మాపో జైలుకు వెళ్లే జగన్ను చూసుకుని బులుగు యూనిఫామ్ వేసుకున్న కొంతమంది పోలీసులు రెచ్చిపోతున్నారని లోకేశ్ మండిపడ్డారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన ఆయన మహిళా రైతులను వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్తున్న వీడియోను పోస్టు చేశారు.