భారత్‌తో ఉద్రిక్తతల వేళ... రక్షణ రంగ బడ్జెట్‌ను భారీగా పెంచిన చైనా
- గత ఏడాదితో పోలిస్తే 6.8 శాతం అధికంగా నిధులు
- రక్షణ బడ్జెట్ 209 బిలియన్ డాలర్లకు పెంపు
- పార్లమెంట్‌లో ప్రధాని లీ కేఖియాంగ్ ప్రకటన
చైనా రక్షణ రంగ బడ్జెట్‌ను భారీగా పెంచుకుంది. భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే 6.8 శాతం అధికంగా నిధులను కేటాయిస్తూ రక్షణ బడ్జెట్‌ను 209 బిలియన్ డాలర్లకు పెంచింది. దీనిపై ఆ దేశ పార్లమెంట్‌లో ప్రధాని లీ కేఖియాంగ్ ప్రకటన చేశారు.
తమ దేశ భద్రత చర్యలను పటిష్ఠం చేసుకోడమే తమ లక్ష్యమని, తాము ఏ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని దిగడం లేదని పేర్కొంటూ రక్షణ బడ్జెట్ పెంపును చైనా సమర్థించుకుంది. గత ఏడాది చైనా 196.44 బిలియన్ డాలర్లను రక్షణ రంగానికి కేటాయించింది.
కొన్నేళ్లుగా రక్షణ రంగానికి చైనా బడ్జెట్‌ను పెంచుకుంటూ వస్తోంది. చైనా రక్షణ బడ్జెట్ అమెరికా బడ్జెట్‌లో నాలుగో వంతుగా ఉంటుంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి అమెరికా రక్షణ రంగ బడ్జెట్ కోసం 740.5 బిలియన్ డాలర్లు కేటాయించింది. అయితే, చైనా 2021లో తలసరి రక్షణ వ్యయం 154 డాలర్లు కంటే తక్కువగా ఉంటుందని చైనా మీడియాలో కథనాలు వస్తున్నాయి. రక్షణ రంగ బడ్జెట్ చైనా సిబ్బందికి శిక్షణ, యుద్ధ సామగ్రి, పరికరాల కోసం ఖర్చు చేస్తుంది.