'ఆర్ట్స్ కాలేజీకి వ‌చ్చాను.. ఎక్క‌డున్నావ్ మిస్ట‌ర్ కేటీఆర్' అంటూ రామ‌చంద్ర‌రావు ప్ర‌శ్న.. కేటీఆర్ చుర‌క‌లు

  • ఉద్యోగాల హామీ అమ‌లుపై చర్చించేందుకు ర‌మ్మ‌న్న రామ‌చంద్ర‌రావు
  • తాను బిజీగా ఉన్నాన‌న్న కేటీఆర్
  • ఎన్డీఏ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పింద‌ని వ్యాఖ్య‌
  • రూ.15 లక్షల చొప్పున ఖాతాల్లో వేస్తానంద‌న్న కేటీఆర్
  • ఆ స‌మాచారం సేక‌రించ‌డంలో బిజీగా ఉన్నాన‌ని ఎద్దేవా 
ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీఆర్ఎస్‌, బీజేపీ నేత‌ల మ‌ధ్య స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్లను విసురుకుంటున్నారు. తాము ఇచ్చిన హామీ మేర‌కు ఉద్యోగాలు ఇచ్చామ‌ని ఇటీవ‌ల తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. దీనిపై బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఉద్యోగాల కల్పనపై ఉస్మానియా యూనివ‌ర్సిటీ సాక్షిగా చర్చకు రావాల‌ని కేటీఆర్‌కు బీజేపీ నేత రామచంద్రరావు సవాల్‌ విసిరారు.

స‌వాలు విసిరిన‌ట్లే ఈ రోజు ఓయూకు రామ‌చంద్ర‌రావు వెళ్లారు. అలాగే, తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో కూడా కేటీఆర్‌తో చర్చిస్తాన‌ని చెప్పారు. అయితే, కేటీఆర్ అక్క‌డ‌కు రాలేద‌ని తెలుపుతూ రామ‌చంద్ర‌రావు ట్వీట్ చేశారు. 'నేను ఆర్ట్స్ కాలేజీ వ‌ద్ద ఉన్నాను.. ఎక్క‌డున్నావు మిస్ట‌ర్ కేటీఆర్?' అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు.

దీనిపై స్పందిస్తూ రామ‌చంద్ర‌రావుకి కేటీఆర్ చుర‌క‌లంటించారు. ప్ర‌ధాని మోదీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల‌ను ఆయ‌న గుర్తు చేశారు. ఏడాదికి 2 కోట్ల చొప్పున ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 12 కోట్ల ఉద్యోగాల‌ను ఎన్డీఏ ఇచ్చిందా? అన్న  విష‌యంతో పాటు, జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో రూ.15 ల‌క్ష‌ల చొప్పున‌ వేసిందా? అన్న విష‌యంపై స‌మాచారం సేక‌రించ‌డంలో తాను బిజీగా ఉన్నాన‌ని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

అయితే, దీనికి ఎన్డీఏ స‌మాధానం చెప్ప‌ట్లేద‌ని, అస‌లు ఎన్డీఏ అంటే నో డేటా అవైల‌బుల్ అని ఆయ‌న అభివ‌ర్ణించారు. త‌న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఉంటే షేర్ చేయాల‌ని ఆయ‌న
 స‌వాలు విసిరారు.


More Telugu News