చంద్రబాబుకు మానసిక వ్యాధి ముదిరింది: విజయసాయిరెడ్డి
- ఎన్నికల్లో ఓడిన తర్వాత వ్యాధి ముదిరింది
- ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు
- ఎన్ని కుట్రలకు పాల్పడినా సాధించేది ఏమీ లేదు
టీడీపీ అధినేత చంద్రబాబు అరుదైన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి నేనేవరికీ భయపడను, నన్నెవరూ భయపెట్టలేరంటూ గింజుకుంటున్నారని అన్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబుకు ఎన్నికల తర్వాత ఆ వ్యాధి మరింత ముదిరిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒక చచ్చిన విషసర్పం వంటివాడని అన్నారు.
కుప్పంకు వెళ్లిన చంద్రబాబు ఇది పులివెందుల, కడప, పుంగనూరు కాదు, ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇస్తారని విజయసాయి అన్నారు. ఉత్తరాంధ్రకు వచ్చి ఇది రాయలసీమ కాదు, ఇక్కడ మీ ఆటలు సాగవంటారని చెప్పారు. ఎక్కడకు వెళ్లినా కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు పని అని విమర్శించారు. ఆయన ఎన్ని కుట్రలకు పాల్పడినా సాధించేది ఏమీ లేదని అన్నారు.