కిడ్నాప్, రేప్‌ డ్రామా ఆడి క‌ల‌క‌లం రేపిన ఘ‌ట్‌కేస‌ర్ బీ ఫార్మ‌సీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

  • అమ్మ‌మ్మ ఇంట్లో ఉంటోన్న యువ‌తి
  • నిద్ర‌మాత్ర‌లు మింగిన వైనం
  • పోలీసులు చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉండ‌డంతోనే?
ఘట్‌కేసర్‌లో ఓ బీ ఫార్మ‌సీ విద్యార్థిని త‌న‌ను కిడ్నాప్ చేశార‌ని, త‌న‌పై అత్యాచారం జ‌రిగిందని డ్రామాలు ఆడి క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఆమె గ‌త రాత్రి నిద్ర‌మాత్ర‌లు మింగింది. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

ఆ యువ‌తిని ఇటీవల ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ పోలీసులు, శాస్త్రీయ ఆధారాలను పక్కాగా సేక‌రించారు. విచార‌ణ‌లోనూ త‌మ‌కు ల‌భ్య‌మైన ఆధారాలతో పోల్చితే బాధితురాలు చెప్పే విషయాలలో పొంత‌న లేక‌పోవ‌డంతో ఆమెపై పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇప్ప‌టికే తేల్చిచెప్పారు.

కిడ్నాప్, అత్యాచారం వంటి తీవ్ర ఆరోప‌ణ‌లు చేసి పోలీసులు, మీడియాను ఆమె త‌ప్పుదోవ ప‌ట్టించ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. చివ‌ర‌కు త‌న‌కు ఇంట్లో ఉండ‌డం ఇష్టంలేకే అలా చేశాన‌ని ఆ యువ‌తి అంగీక‌రించింది. ఇటీవ‌లే ఆసుప‌త్రి నుంచి ఆమె డిశ్చార్జి అయి, త‌న ఇంట్లో కాకుండా అమ్మ‌మ్మ ఇంట్లో ఉంటోంది. ఆమెను పోలీసులు అరెస్టు చేసి, కేసు నమోదు చేసే అవ‌కాశం ఉండ‌డం, ఆమెపై అంద‌రి నుంచీ తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న కార‌ణంగానే ఆ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.


More Telugu News