వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. ఒక్క నిమిషంలో మేమంతా కూడా రాజీనామా చేస్తాం: చంద్రబాబు

  • విశాఖ ఉక్కును వదల వద్దు
  • ప్రభుత్వం చేతిలోనే ఉంది
  • జగన్ ఏం చెబితే అది చేసేందుకు సిద్ధమన్న చంద్రబాబు
విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసే ఆలోచనను వ్యతిరేకించే పక్షంలో అధికార వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, తాము ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తనతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని, ఈ విషయంలో తాను సీనియర్ నేతననే అహం లేకుండా ప్రజల మనోభావాలను పరిరక్షించేందుకు ముందుకు వస్తానని అన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు సీఎం స్థాయిలో ఉన్న జగన్ ఏం చెబితే, అది చేస్తానని, ఈ విషయంలో అధిక బాధ్యత తనపైనే ఉందని జగన్ గుర్తించాలని సూచించారు.


More Telugu News