భర్తను వదిలేసి వేరే వ్యక్తితో వుంటోందన్న ఆరోపణతో.. మహిళను దారుణంగా హింసించిన గ్రామస్థులు.. వీడియో వైరల్
- మధ్యప్రదేశ్‌లో ఘటన
- బాలుడిని భుజాలపై మోయమంటూ శిక్ష
- కొడుతూ, 3 కిలోమీటర్ల దూరం ఊరేగింపు
- పోలీసు కేసు నమోదు
ఓ మహిళ భుజాలపై బాలుడిని ఎక్కించి ఊరేగించారు గ్రామస్థులు. ఇలా ఆమె దాదాపు మూడు కిలోమీటర్లు బాలుడిని భుజాలపై మోసుకుంటూ వెళ్లేలా చేశారు. మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మీడియాకు చిక్కాయి.
భోపాల్‌లోని గునా జిల్లాలో ఒక మహిళ తన భర్తతో విడిపోయి వేరే వ్యక్తితో ఉంటోంది. దీంతో గ్రామస్థులు ఆమె అత్తింటివారితో కలిసి ఆమెకు బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకుని ఈ ఘటనకు పాల్పడ్డారు. అంతా చుట్టూ చేరి ఆమెపై బెదిరింపులకు పాల్పడి ఓ బాలుడిని భుజాలపై మోస్తూ శిక్ష అనుభవించాలని చెప్పడంతో ఆమె వారిని ఎదిరించలేకపోయింది.
ఆమెను ఇలా ఊరేగిస్తూ, కొడుతూ ఆ దృశ్యాలను కొందరు స్మార్ట్ ఫోన్లలో తీశారు. ఆమెను అవమానిస్తూ గ్రామస్థులు, అత్తింటివారు పాల్పడిన ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు.