సియట్ బ్రాండ్ అంబాసిడర్ గా రానా!
- వాహనాలకు టైర్లు అందిస్తున్న సియట్
- రానాతో డీల్ కుదుర్చుకున్నట్టు ప్రకటన
- టీవీ ప్రకటనలను తయారు చేయనున్నామని వెల్లడి
వాహనాలకు టైర్లను సరఫరా చేస్తున్న ప్రముఖ సంస్థ సియట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనతో డీల్ కుదుర్చుకున్నట్టు సియట్ పేర్కొంది. పంక్చర్ సేఫ్ శ్రేణిలో తాము విడుదల చేయనున్న బైక్ టైర్లకు ప్రచారం చేసేందుకు ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నామని, రానాతో వివిధ రకాల టీవీ ప్రకటనలు తయారు చేయనున్నామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో రానాకు ఎంతో మంది అభిమానులు ఉన్నారని, ఈ బైక్ టైర్ల మార్కెటింగ్ కోసం సరికొత్త క్యాంపెయిన్ ను నిర్వహించనున్నామని పేర్కొన్నారు.