సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • హ్యాపీగా ఉందంటోన్న సమంత
  • ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా
  • ముంబైలో మొదలైన 'లైగర్'  
*  మంచి నటి నయనతార, పవర్ ఫుల్ ఆర్టిస్టు విజయ్ సేతుపతితో కలసి ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందంటోంది కథానాయిక సమంత. వీరితో కలసి నటించాలనే కోరిక ఇప్పుడు 'కాత్తువాక్కుల రెండు కాదల్' చిత్రంతో తీరుతుందని ఆమె పేర్కొంది. నిన్నటితో ఈ చిత్రం తాజా షెడ్యూలు పూర్తయింది.
*  ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తాము నిర్మించనున్నట్టు నిర్మాతలు నవీన్, రవి తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న 'సలార్' చిత్రం పూర్తయ్యాక ఇది మొదలవుతుంది.
*  విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. కరోనా మూలంగా నిలిచిపోయిన ఈ చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగు నేటి నుంచి ముంబైలో జరుగుతుంది. దీనికి ప్రముఖ నటి ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  


More Telugu News