మన్నవలో 102 ఓట్లు తొలగించారు: ధూళిపాళ్ల నరేంద్ర
- పొన్నూరు మండలం మన్నవలో ఓట్లను తొలగించారు
- తొలగించిన ఓట్లను కలపాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది
- హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఎస్ఈసీని కోరాం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. రేపు తొలి విడత పోలింగ్ జరగబోతోంది. పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమకు కేటాయించిన స్థలాలకు చేరుకుంటున్నారు. ఎన్నికల సామగ్రి పోలింగ్ స్టేషన్లకు చేరుతోంది. మరోవైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. పొన్నూరు మండలం మన్నవలో 102 ఓట్లను అక్రమంగా తొలగించారని ఆయన ఆరోపించారు. ఓట్ల తొలగింపుపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. తొలగించిన 102 ఓట్లను కలపాలని హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఎస్ఈసీని కోరామని చెప్పారు.