ఆర్బీఐ ప్రకటనతో మార్కెట్ లో జోష్.. భారీ లాభాల్లో సూచీలు
- 51 వేల మార్కును దాటిన బీఎస్ ఈ
- 15 వేల మార్కును అందుకున్న ఎన్ఎస్ఈ
- భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్న బ్యాంకింగ్ షేర్లు
- సగటున 13.02% పెరిగిన షేర్ల విలువ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిధి విధాన ప్రకటనతో మార్కెట్లు మంచి జోష్ తో ప్రారంభమయ్యాయి. సూచీలు లాభాల్లో దూసుకుపోతున్నాయి. 30 షేర్ల బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ (బీఎస్ఈ) చరిత్రలో తొలిసారి 51 వేల మార్కును దాటింది. 391 పాయింట్ల లాభంతో ప్రారంభమై, ప్రస్తుతం 0.77 శాతం పాయింట్లు లాభపడింది. ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ (ఎన్ఎస్ఈ) 15 వేల మార్కును చేరింది.
రెపో, రివర్స్ రెపో రేటులో మార్పులు చేయకపోవడం, క్యాష్ రిజర్వ్ రేషియోపైనా ఆర్బీఐ కీలక ప్రకటన చేయడంతో బ్యాంకింగ్ రంగంలో మంచి ఊపు వచ్చింది. దీంతో వాటి షేర్లే ఎక్కువగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ, ఇండస్ఇండ్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ షేర్ల విలువ 13.02 శాతం మేర లాభాల్లో వున్నాయి. భారతీ ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్, ఎం అండ్ ఎం, మారుతీ టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలలో ట్రేడ్ అవుతున్నాయి.