ఒంగోలు రిమ్స్ డెంటల్ డాక్టర్ ను సీఎం ఆదేశాలతో మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలించాం: మంత్రి ఆళ్ల నాని
- ఒంగోలు రిమ్స్ లో పనిచేస్తున్న డాక్టర్ ధనలక్ష్మి
- తాత్కాలిక పద్ధతిలో సేవలు
- ఇటీవల తీవ్ర అనారోగ్యం
- స్పెషల్ కేసుగా పరిగణించిన సీఎం జగన్
- ప్రస్తుతం చెన్నై అపోలో ఆసుపత్రిలో కోలుకుంటున్న ధనలక్ష్మి
ప్రకాశం జిల్లా పామూరు మండలం బొట్లగూడూరు గ్రామానికి చెందిన డాక్టర్ ధనలక్ష్మి కరోనా వ్యాప్తి సమయంలో ఒంగోలు రిమ్స్ లో ఆర్నెల్ల కాలానికి తాత్కాలిక డెంటల్ వైద్యురాలిగా నియమితులయ్యారు. అయితే ఇటీవల డాక్టర్ ధనలక్ష్మి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండడంతో సీఎం జగన్ ఆదేశాల మేరకు చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. డాక్టర్ ధనలక్ష్మిది ప్రత్యేక కేసుగా భావించి అన్ని చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో డాక్టర్ ధనలక్ష్మికి మెరుగైన వైద్యం అందుతోందని, ఆమె కోలుకుంటున్నారని వెల్లడించారు. త్వరలోనే ఆమె పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని భావిస్తున్నామని తెలిపారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఒంగోలు నుంచి ప్రత్యేకంగా మత్తువైద్యుడు డాక్టర్ ప్రదీప్ ను కూడా పంపించామని మంత్రి ఆళ్ల నాని వివరించారు.